![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 మరికొన్ని రోజుల్లో మొదలవ్వబోతుంది. భారీ అంచనాలు క్రియేట్ చెయ్యడానికి ప్రోమోల మీద ప్రోమోలు వదులుతున్నాడు బిగ్ బాస్. ఇది ఇలా ఉంటే ఎక్స్ కంటెస్టెంట్ అయిన అమర్ దీప్ బిగ్ బాస్ ని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో వదిలాడు. అది ప్రమోషనే కానీ తన ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటపెట్టినట్లుగా అది ఉంది. ఇండైరెక్ట్ గా పల్లవి ప్రశాంత్ కి కౌంటర్ వేసినట్టనిపిస్తుంది.. అసలు అతనేమన్నాడో ఓసారి చూసేద్దాం..
నేను మీ అమర్ దీప్ చౌదరి. బిగ్ బాస్ సీజన్-7 రన్నరప్ ని. బిగ్ బాస్ అనేది ఒక డ్రీమ్. అందరికి కలలు ఉంటాయి. బిగ్ బాస్‌లోకి రావాలని చాలామంది అనుకోవచ్చు.. చూశాంలే ఆడావ్ కదా అని అనుకుంటారు.. కానీ అక్కడ నేను ఆడింది మాత్రమే మీకు కనిపించింది. బిగ్ బాస్ మీతో ఆడింది.. నాతో ఆడింది ఎవ్వరికి కనిపించదు. అదే మన వీక్ నెస్, స్ట్రెంత్, ప్రేమ, ఆప్యాయత, ఫ్రెండ్ షిప్.. వీటన్నింటిని కలిపి కొడితేనే బిగ్ బాస్. అన్నింటికి చాలా సిద్దంగా ఉండాలి. ముఖ్యంగా తెగించి నిలబడాలి.
బిగ్ బాస్ సీజన్-9 కామన్‌మ్యాన్‌కి అగ్నిపరీక్ష. అది ఎలా ఉండబోతుందో తెలుసా.. అక్కడ భయమే లేని జడ్జులు ఉండబోతున్నారు. వాళ్లు మిమ్మల్ని డ్రిల్ చేస్తారు.. కిల్ చేస్తారు.. సూటిగా అడుగుతారు.. మీరు సుత్తి లేకుండా సమాధానాలు చెప్పాలి. హానెస్ట్‌గా ఉండాలి.. డబుల్ గేమ్ ఆడటానికి వీళ్లేదమ్మా.. డబుల్ ఫేస్ చూపించడానికి లేదు. ఒకటే ఫేస్.. టాస్క్‌లు ఈసారి మామూలుగా ఉండవు. ఇవన్నీ దాటుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. చాలా టఫ్‌గా ఉండబోతుంది.. చాలా కొత్తగా కూడా ఉండబోతుంది. నేను మీకు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏంటంటే.. బీ బోల్డ్, బీ షార్ప్.. బీ స్ట్రైట్. న్యాయంగా ఉండండి. హానెస్ట్‌గా ఉండండి.. డబుల్ ఫేస్ చూపించొద్దు. ఏది చెప్పినా సరే నిజం చెప్పండి.. నిలబడండి.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష.. ది బిగ్.. బిఫోర్ ది బిగ్గెస్ట్. త్వరలోనే హాట్ స్టార్‌లో ప్రసారం కాబోతుందంటూ అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ సీజన్-9(Bigg Boss season 9) పై హైప్ ని క్రియేట్ చేయడానికి ఇలా ఎక్స్ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ బానే వాడుకుంటున్నాడు.
![]() |
![]() |